saidharamtej: మెగా ఫ్యామిలీలో ఒకే ఒక్క హీరోతో పని చేయలేదు: హాస్య నటుడు పృథ్వీ

  • మెగా ఫ్యామిలీలో ఒక్కరితో తప్ప అందరు హీరోలతో పని చేశాను
  • 'ఇంటిలిజెంట్' సినిమాలో ధర్మాభాయ్ అంటే వణికిపోతా
  • ఈ సినిమా సక్సెస్ అవుతుంది
 మెగా ఫ్యామిలీలో ఒకేఒక్క హీరోతో తాను ఇంతవరకు పని చేయలేదని, మిగిలిన అందరు హీరోలతో తాను పని చేశానని సినీ కమేడియన్ పృథ్వీ తెలిపాడు. రాజమండ్రిలో జరిగిన 'ఇంటిలిజెంట్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ, సాయి ధరమ్ తేజ్ కి పవన్ కల్యాణ్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయని అన్నాడు.

‘ఇంటిలిజెంట్' సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో తనకు కాంబినేషన్ సీన్లు లేకపోయినప్పటికీ ధర్మాభాయ్ పేరు వింటేనే గడగడ వణికిపోతానని చెప్పాడు. ఈ సినిమా డైరెక్టర్ తమతో స్టెప్పులు, ఫైట్లు చేయించకపోయినా రోడ్లు వేయించారని నవ్వుతూ చెప్పారు. ఈ సినిమా సాయి ధరమ్‌ కు మంచి పేరుతేవాలని, హిట్ కావాలని లక్ష్మీనరసింహ స్వామిని కోరుతున్నానని ఆయన చెప్పారు. 
saidharamtej
intelligent
pruthvi

More Telugu News