YSRCP: మేము అధికారంలోకి రాగానే నవంబర్ 1ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా పరిగణిస్తాం!: వైఎస్ జగన్

  • నెల్లూరు జిల్లా దేవరపాళెంలో ప్రజా సంకల్పయాత్ర
  • అధికారంలోకి రాగానే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా
  • ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైసీపీ అధినేత
తాము అధికారంలోకి వస్తే నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంగా అమలు చేస్తామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా దేవరపాళెంలో జగన్ ఫర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ, తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి కారణమైన పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యులేనని అన్నారు. పేదరికానికి కులం, మతంతో సంబంధం లేదని, తాము అధికారంలోకి రాగానే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, తెల్లకార్డులున్న వారందరికీ ‘నవరత్నాలు’ అమలు చేస్తామని జగన్ అన్నారు.
YSRCP
Jagan

More Telugu News