south africa: క్రికెట్ అప్ డేట్స్ : లంచ్ బ్రేక్.. విజయ లక్ష్యానికి రెండు పరుగుల దూరంలో భారత్

  • సెంచూరియన్ వన్డేలో భోజన విరామ సమయం 
  • శిఖర్ థావన్ 51 పరుగులు, కోహ్లీ 44 పరుగులతో కొనసాగుతున్న క్రీడాకారులు
  • ప్రస్తుతం టీమిండియా స్కోరు 19 ఓవర్లలో 117/1
సెంచూరియన్ వన్డేలో విజయానికి రెండు పరుగుల తేడాలో భారత్ ఉంది. విజయ లక్ష్యాన్ని చేరుకునే క్షణంలో భోజన విరామ సమయం కావడంతో లంచ్ బ్రేక్ పడింది. దక్షిణాఫ్రికా జట్టు త్వరగా ఔటు కావడంతో టీమిండియా భోజనం చేయకుండానే బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది.

లంచ్ బ్రేక్ సమయం రావడంతో అంపైర్లు విరామం ప్రకటించారు. శిఖర్ థావన్ 51 పరుగులు, కోహ్లీ 44 పరుగులతో కొనసాగుతున్నారు. వన్డేల్లో 24వ అర్ధశతకాన్ని శిఖర్ థావన్ నమోదు చేశాడు. 19 ఓవర్లలో భారత్ స్కోరు 117/1గా ఉంది. కాగా, 32.3 ఓవర్లకే ఆల్ అవుటైన దక్షిణాఫ్రికా 118 పరుగులు చేసింది.  
south africa
India
Cricket

More Telugu News