Telangana: శివసేన అధినేతతో నేను మాట్లాడలేదు: చంద్రబాబు

  • ఉద్ధవ్ ఠాక్రేకు నేను ఫోన్ చేయలేదు
  • ఆ వార్తలు అబద్ధం..ఖండిస్తున్నా
  • టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో తాను ఫోన్ లో మాట్లాడినట్టు వస్తున్న వార్తలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖండించారు. ఉద్ధవ్  ఠాక్రేతో తాను మాట్లాడానంటూ వస్తున్న వార్తలు అబద్ధమని ఆయన కొట్టిపారేశారు. కాగా, కేంద్రబడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆంగ్ల మీడియాలో చంద్రబాబుపై భిన్నకథనాలు ప్రచారంలో ఉన్నాయి. ‘చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ పెట్టబోతున్నారు’, మోదీపై ఒత్తిడి చేసిన పనులు సాధించుకుంటారు’, ‘మోదీ హవాకు ఎదురు తిరగగల నాయకుడు చంద్రబాబే’ అంటూ భిన్న కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు చంద్రబాబు ఫోన్ చేశారనే వదంతులు వెలువడటం గమనార్హం. 
Telangana
Chandrababu
siva sena
uddav thakrey

More Telugu News