Chandrababu: రెండు ఎకరాల రైతు చంద్రబాబుకు లక్షల కోట్లు ఎలా వచ్చాయి?: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

  • మేము నిప్పులాంటి వాళ్లం .. టీడీపీ నేతలు అవినీతికి వారసులు
  • ఓ మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్నారు
  • రాష్ట్రంలో రూలింగ్ లేదు.. ట్రేడింగ్ మాత్రమే జరుగుతోంది: వీర్రాజు
టీడీపీపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాము నిప్పులాంటి వాళ్లమని, టీడీపీ నేతలు అవినీతికి వారసులని, రాష్ట్రంలో ఓ మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే తమ అజెండా అని, రాష్ట్రంలో రూలింగ్ లేదని, ట్రేడింగ్ మాత్రమే జరుగుతోందని, రెండు ఎకరాల రైతు అంటున్న మీకు లక్షల కోట్లు ఆస్తులెలా వచ్చాయంటూ చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు.
Chandrababu
Telugudesam
somu veeraj
bjp

More Telugu News