Chandrababu: రాయలసీమ కరువును చంద్రబాబు గాలికొదిలేశారు: సోము వీర్రాజు

  • అమరావతికి లక్ష కోట్లు కావాలంటూ చంద్రబాబు భజన చేస్తున్నారు
  • మేము కాంగ్రెస్ పార్టీ కోవర్టులం కాదు
  • ఇంకా, చంద్రబాబే ఒకప్పుడు ‘కాంగ్రెస్’ లో పనిచేశారు: వీర్రాజు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పజెప్పేస్తామని ప్రకటించిన చంద్రబాబు... ఇప్పుడు మరో కంపెనీని తెరపైకి ఎందుకు తెచ్చారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిన్న ప్రశ్నించిన విషయం తెలిసిందే.  తాజాగా, సీఎం చంద్రబాబునాయుడిపై మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి లక్ష కోట్లు కావాలంటూ భజన చేస్తున్న చంద్రబాబు, రాయలసీమ కరువు గురించి మాట్లాడటం లేదని, ఆ విషయాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. తామేమీ కాంగ్రెస్ పార్టీ కోవర్టులం కాదని, ఇంకా, చంద్రబాబే ఒకప్పుడు కాంగ్రెస్ లో పనిచేశారని అన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల్లో ఎంతమేర పనులు జరిగాయని సోము వీర్రాజు నిన్న ప్రశ్నించిన విషయం విదితమే.  
Chandrababu
Telugudesam
somu veeraj
BJP

More Telugu News