Chandrababu: ఎటువంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు.. చంద్రబాబును కోరిన అమిత్ షా?

  • అన్ని విషయాలపై త్వరలో చర్చిద్దాం
  • చంద్రబాబుతో అమిత్ షా అన్నట్టు  సమాచారం?
  • అమరావతిలో కొనసాగుతున్న టీడీపీ కీలక సమావేశం
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, కొద్దిసేపటి క్రితం అమరావతిలో కీలకమైన సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో ఎటువంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని, అన్ని విషయాలపై త్వరలోనే చర్చిద్దామని అమిత్ షా కోరినట్టు తెలుస్తోంది.

కాగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడితో తమ పొత్తు కొనసాగింపుకే కట్టుబడి ఉన్నామని, బీజేపీకి టీడీపీ ఎంతోకాలంగా మిత్రపక్షమనే విషయాన్ని మర్చిపోమని అన్నారు. ఏపీ ప్రయోజనాలపై దృష్టి సారించేందుకు కట్టుబడి ఉన్నామని, ఈ విషయమై త్వరలోనే చర్చిస్తామని అన్నారు.
Chandrababu
amit sha
Telugudesam
BJP

More Telugu News