Kurnool District: నిధికి దగ్గరయ్యారట... చెన్నంపల్లిలో స్థానిక కూలీల తొలగింపు!

షార్ట్స్‌లో చూడండి
కర్నూలు జిల్లా చెన్నంపల్లిలో ఉన్న పురాతన గుత్తి రాజుల కోటలో ఉన్న విలువైన నిధికి చాలా దగ్గరకు వచ్చామని భావిస్తున్న పురావస్తు అధికారులు, తిరిగి తవ్వకాలను ప్రారంభించారు. గతంలో 36 రోజుల పాటు అవిశ్రాంతంగా తవ్వకాలు జరిపి, ఆపై అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ, భూమి లోపలి భాగాన్ని 20 రోజుల పాటు స్కాన్ చేసిన అధికారులు, నిన్నటి నుంచి తవ్వకాలను ప్రారంభించారు.

గతంలో స్థానిక కూలీలను పెట్టి తవ్వకాలు సాగించిన అధికారులు, ఇప్పుడు మాత్రం వారిని తొలగించి, వేరే ప్రాంతపు కూలీలను తీసుకు వచ్చి పని చేయిస్తున్నారు. తెలుగు భాష కూడా తెలియని కూలీలను తెచ్చి తవ్వకాలు సాగిస్తున్నారని, అధికారుల తీరు అంతు చిక్కడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Go Back to Shorts
Kurnool District
Chennampalli Fort
Gutti Dynasty

More Telugu News