Nara Lokesh: 'సింహం గురించా?' అంటూ బాలయ్యపై చమత్కరించిన లోకేష్!

  • మీ అందరికీ ఆయన బాలయ్య
  • నా ఒక్కడికీ ముద్దుల మామయ్య
  • తన చమత్కారంతో నవ్వులు పూయించిన లోకేష్
నేడు అట్లాంటాలో పర్యటిస్తున్న నారా లోకేష్, ప్రవాస భారతీయులతో సమావేశమైన వేళ, అక్కడికి వచ్చిన అతిథులు, బాలకృష్ణ గురించి మాట్లాడాలని గొడవ చేస్తున్న వేళ, లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభిమానులు 'జై బాలయ్య జై బాలయ్య' అని నినాదాలు చేస్తుండగా, "సింహం గురించి నేనేం చెప్పాలి? అయ్యా... ఒక ;నరసింహనాయుడు' అయినా, ఒక 'సమరసింహారెడ్డి' అయినా, ఒక 'సింహా' అయినా, ఒక 'లెజండ్' అయినా... మీ అందరికీ... అయ్యా... మీ అందరికీ వినాల. వినాలప్పా... 'జై' మళ్లీ చెప్పొచ్చుగానీ, మీ అందరికీ బాలయ్య, నా ఒక్కడికీ ముద్దుల మామయ్య" అని చమత్కరించడంతో ఆడిటోరియం నవ్వులతో దద్దరిల్లింది.
Nara Lokesh
Balakrishna
Atlanta

More Telugu News