Niveda Thomas: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

షార్ట్స్‌లో చూడండి
*  రవితేజ సరసన మలయాళ బ్యూటీ నివేద థామస్ నాయికగా నటించనుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే 'అమర్ అక్బర్ ఆంథోని' చిత్రంలో రవితేజ మూడు పాత్రలు పోషించనున్నాడు. ఈ చిత్రం కోసం ఇప్పటికే కాజల్ ను ఓ నాయికగా ఎంపిక చేయగా, మరో నాయికగా నివేదను తాజాగా తీసుకున్నారు. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి వుంది.
*  'రంగస్థలం' చిత్రంలో తన షూటింగ్ పార్ట్ పూర్తయిందని చెప్పింది కథానాయిక సమంత. స్పెషల్ టీంతో ఇది తనకు స్పెషల్ జర్నీ లాంటిదని ఆమె ట్వీట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో చరణ్, సమంత జంటగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే.
*  వరుస విజయాలతో వెళుతున్న యంగ్ హీరో శర్వానంద్ త్వరలో సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో నటించే ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా 'హలో' ఫేం కల్యాణి నటించనుంది.      
*  తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నటించే 'ఎన్టీఆర్' బయోపిక్ లో కీలక పాత్రలో ప్రముఖ నటి నదియా నటించనున్నట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను నదియా పోషిస్తుందట.  
Go Back to Shorts
Niveda Thomas
samanta
sharwanand
nadiya

More Telugu News