Boddupalli Srinivas: పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకే అక్కడికి వెళ్లాను!: అదృశ్యమై తిరిగొచ్చిన నల్గొండ సీఐ

  • బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసును విచారిస్తున్న సీఐ వెంకటేశ్వర్లు
  • శుక్రవారం నుంచి కనిపించకుండా పోవడంతో పలు ఊహాగానాలు
  • బాపట్లలో గుర్తించి నల్గొండకు తెచ్చిన పోలీసులు
కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసును విచారిస్తూ, శుక్రవారం నాడు అదృశ్యమైన నల్గొండ టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తిరిగి వచ్చారు. ఆయన అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంపై పలు ఊహాగానాలు రాగా, గుంటూరు జిల్లాలోని బాపట్లలో ఒక రిసార్టులో ఉన్న ఆయన్ను నల్గొండ పోలీసులు కనిపెట్టి తీసుకు వచ్చారు.

పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల తాను రిలాక్స్ అయ్యేందుకు బాపట్ల వెళ్లానని ఆయన చెప్పడం గమనార్హం. వెళ్లేముందు తన ఆయుధాన్ని, సిమ్ కార్డును పోలీసు అధికారులకు అప్పగించానని అన్నారు. తరచూ తాను బాపట్ల వెళుతుంటానని చెప్పారు. కాగా, శ్రీనివాస్ హత్య కేసుతో పాటు పాలకూరి రమేశ్ హత్య కేసులోనూ వెంకటేశ్వర్లు విచారణ అధికారిగా ఉండగా, టీఆర్ఎస్ నేతల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ఆయన కనిపించకుండా పోయారన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
Boddupalli Srinivas
CI Venkateshwarlu
Nalgonda District

More Telugu News