Asaduddin Owaisi: హర్యానాలో కశ్మీర్‌ యువకులపై దాడి.. మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ

షార్ట్స్‌లో చూడండి
హ‌ర్యానాలోని మ‌హేంద్ర‌గ‌ఢ్‌లో ఇద్ద‌రు క‌శ్మీర్ యువ‌కుల‌పై 15 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో ఆ ఇద్దరు కశ్మీర్ యువకులు జియోగ్రఫీ కోర్సు చేస్తున్నారని, నిన్న ఓ మసీదులో ప్రార్థనలు చేసి, ఓ మార్కెట్‌కి వెళ్లిన ఆ ఇద్దరు యువకులపై ఓ గ్రూప్ కర్రలతో దాడికి దిగిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో పలువురిని అరెస్టు చేశామని చెప్పారు.

కాగా, కశ్మీర్ యువకులపై దాడి జరగడాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. హర్యానాలో ప్రజలకు భద్రత కల్పించడంలో ఖట్టర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని అన్నారు. భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమని, ఆ రాష్ట్ర పౌరులపై దాడి జరిపి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పౌరులకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఇటువంటి తీరును ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. 
Go Back to Shorts
Asaduddin Owaisi
Jammu And Kashmir
attack
youngsters

More Telugu News