Tollywood: ల‌క్ష్మీదేవిగారి శిష్యుడిగా గ‌ర్వ‌ప‌డుతున్నాను: మెగాస్టార్ చిరంజీవి

  • ఆమె పేరు లక్ష్మీదేవి అయినా తన పాలిట సరస్వతీ దేవి
  • ఆమె ఆత్మకు శాంతి కలగాలి
  • కనకాల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి : చిరంజీవి
ప్రముఖ సీనియర్ నటి, నట శిక్షకురాలు లక్ష్మీదేవి కనకాల మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆమె పేరు లక్ష్మీదేవి అయినా తన పాలిట సరస్వతీ దేవి అని, ఆమె నేర్పిన పాఠాలే, తన ప్రతిభా పాటవాలకి మూలమని, నటనలో ఆమె నేర్పిన మెళకువలే తనలోని నటుడికి మెలుకువలని అన్నారు.

లక్షలాది కుటుంబాలకు అభిమాన కథానాయకుడిగా ఎంత సంతోషపడతానో, ఆమె శిష్యుడిగా అంత గర్వపడుతున్నానని అన్నారు. ఆమె దూరమవ్వడం తీరనిలోటని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని, కనకాల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. దేవదాసు- లక్ష్మీదేవిల కుమారుడు రాజీవ్ కనకాలకు చిరంజీవి ఫోన్ చేసి పరామర్శించారు.  
Tollywood
Chiranjeevi
lakshmi kanakala

More Telugu News