Chandrababu: మా అత్తగారు కేన్సర్ వ్యాధితో చాలా ఇబ్బంది పడ్డారు: చంద్రబాబునాయుడు

  • గుంటూరులో ఒమెగా కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం
  • నవ్యాంధ్రలో కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం శుభపరిణామం
  • ప్రపంచంలోనే అద్భుతమైన మెడికల్ హబ్ గా అమరావతి మారబోతోంది : చంద్రబాబు
గుంటూరులో ఒమెగా కేన్సర్ ఆసుపత్రిని సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం పద్దెనిమిది రోజుల్లోనే ఒమెగా కేన్సర్ ఆసుపత్రికి ఏపీఐసీసీ అనుమతి లభించిందని అన్నారు. నవ్యాంధ్రలో కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య, తన అత్తయ్య బసవతారకం గురించి ఆయన ప్రస్తావించారు. తమ అత్తగారు క్యాన్సర్ వ్యాధితో చాలా ఇబ్బందులు పడ్డారని, ఆ ఇబ్బంది ఎవరూ పడకూడదనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ లో బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని ఎన్టీఆర్ నాడు స్థాపించారని అన్నారు. ఇక ప్రపంచంలోనే అద్భుతమైన మెడికల్ హబ్ గా అమరావతి మారబోతోందని, ఇప్పటికే 14 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామని అన్నారు. 
Chandrababu
omega hospital
guntur

More Telugu News