Viral Videos: తరగతి గదిలో చితక్కొట్టుకున్న విద్యార్థులు... వీడియో వైరల్‌

  • ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు
  • ఆసుపత్రిలో చికిత్స
  • రాజ‌స్థాన్‌ జోధ్‌పూర్‌లో ఘటన
రాజ‌స్థాన్‌ జోధ్‌పూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు తరగతి గదిలో చితక్కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో పాఠశాలలోని సీసీ కెమెరాకు చిక్కింది. ఇద్దరు విద్యార్థుల్లో ఓ విద్యార్థి కత్తెరతో దాడి చేసి పారిపోయాడు. దీంతో బాధిత విద్యార్థి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తరగతి గదిలో టీచర్ లేని సమయంలో ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారు. సదరు విద్యార్థులు 11వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
Viral Videos
jodhpur
school

More Telugu News