honda: హోండా నుంచి 11 కొత్త మోడళ్లు... 2018 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శన... మరో నాలుగు రోజుల్లో కనువిందు

  • 7 నుంచి గ్రేటర్ నోయిడాలో ప్రదర్శన
  • ఓ రేస్ బైక్, ఎలక్ట్రికల్ స్కూటర్ కూడా
  • ఆరు దేశీయ మార్కెట్ కోసమే
దేశంలో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ అయిన హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) త్వరలో 11 కొత్త మోడళ్లతో కస్టమర్లకు చేరువ కానుంది. ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగే ఆటో ఎక్స్ పో 2018లో ఈ మోడళ్లను ప్రదర్శనగా ఉంచనున్నట్టు సంస్థ ప్రకటించింది.

వీటిలో ఓ రేసింగ్ బైక్, ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ స్కూటర్ కూడా ఉంటాయి. ఓ ఆటో ఎక్స్ పోలో ఇన్నేసి మోడళ్లను ప్రదర్శించనుండడం హోండాకు ఇదే మొదటిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హోండా క్లిక్, గ్రాజియా పేరుతో రెండు స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసే ఉంటుంది. ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనకు ఉంచే వాటిలో ఆరు దేశీయ మార్కెట్ కోసం కాగా, నాలుగు అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఉద్దేశించినవిగా హెచ్ఎంఎస్ఐ ప్రకటించింది.
honda
motorcycles
auto expo

More Telugu News