Tollywood: ప్రముఖ నటి లక్ష్మీదేవి కనకాల మృతి!

  • హైదరాబాద్ మణికొండలోని సొంత ఇంట్లో లక్ష్మీదేవి మృతి
  • ఈరోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు
  • లక్ష్మీదేవి మృతిపై సినీ ప్రముఖుల సంతాపం
ప్రముఖ సీనియర్ నటి, నట శిక్షకురాలు లక్ష్మీదేవి కనకాల (79) మృతి చెందారు. హైదరాబాద్ మణికొండలోని సొంత ఇంట్లో ఆమె తుదిశ్వాస విడిచారు. సీనియర్ నటుడు దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి. ఈరోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు లక్ష్మీదేవి కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, ఆహుతి ప్రసాద్ తదితర నటులకు తన భర్తతో కలిసి ఆమె శిక్షణ ఇచ్చారు. వీరికి సంబంధించిన నట శిక్షణాలయాలు హైదరాబాద్, చెన్నైలో ఉన్నాయి. దేవదాస్ - లక్ష్మీదేవి దంపతుల తనయుడు రాజీవ్ కనకాల, కూతురు శ్రీలక్ష్మి.
Tollywood
Hyderabad
laxmidevi kanakala

More Telugu News