Anushka Shetty: అభిమానులతో కలసి సినిమా చూడనున్న అనుష్క.. ఏ ఊర్లో, ఎప్పుడో చూడండి!

  • 5వ తేదీన భాగమతి థ్యాంక్స్ టూర్
  • మహిళలతో కలసి సినిమా చూడనున్న అనుష్క
  • మహిళలకు థ్యాంక్స్ చెప్పేందుకు టూర్
అనుష్క నటించిన 'భాగమతి' మంచి విజయాన్ని చేజిక్కించుకుంది. కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దీంతో చిత్ర యూనిట్ 'భాగమతి థ్యాంక్స్ టూర్'ను చేపట్టబోతోంది. సోమవారం ఈ టూర్ జరగనుంది. ఈ సినిమా ఘన విజయం సాధించడానికి మహిళలే కారణం అని భావిస్తున్న చిత్ర యూనిట్... మహిళలకు థ్యాంక్స్ చెప్పేందుకు టూర్ నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా అనుష్కతో కలసి సినిమా చూసే అవకాశాన్ని మహిళలకు కల్పిస్తోంది. సోమవారం నాడు మార్నింగ్ షోను విజయవాడలోని రాజ్ థియేటర్ లో, మ్యాట్నీని ఏలూరులోని మినీ సత్యన్నారాయణ థియేటర్ లో, ఫస్ట్ షోను రాజమండ్రిలోని స్వామి థియేటర్ లో మహిళా ప్రేక్షకులతో కలసి అనుష్క 'భాగమతి' సినిమాను చూడనుంది.
Anushka Shetty
Bhaagamathie
tollywood
bhaagamathie thanks tour

More Telugu News