Nara Lokesh: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ సంసిద్ధత!

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికాలో చేపట్టిన ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో సానుకూల ఫలితాలనే ఇస్తోంది. ప్రస్తుతం అట్లాంటాలో ఉన్న ఆయన అక్కడి కార్డ్ లీటిక్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సంస్థ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కార్డ్ లీటిక్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరలోనే 100 మంది ఉద్యోగులతో విశాఖపట్నంలో కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపింది.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, కేవలం 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులను మంజూరు చేస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలా సహాయసహకారాలను అందిస్తామని తెలిపారు.
Go Back to Shorts
Nara Lokesh
america

More Telugu News