mla hemanth katare: మధ్యప్రదేశ్ లో జర్నలిజం విద్యార్థినిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అత్యాచారం!

  • ఎమ్మెల్యే హేమంత్ కటారేపై కేసు నమోదు
  • అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే
  • యువతి బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ గతంలోనే ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
జర్నలిజం చదువుతున్న ఓ విద్యార్థినిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే హేమంత్ కటారే తనపై అత్యాచారం జరిపారంటూ బాధిత యువతి జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ కు లేఖ రాసింది. దీంతో, భోపాల్ మహిళా పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనికి ముందే బాధితురాలిపై భోపాల్ క్రైంబ్రాంచ్ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. జర్నలిజం విద్యార్థిని అయిన యువతి తనను బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది జరిగిన తర్వాత ఎమ్మెల్యేపై సదరు యువతి కేసు పెట్టింది.
mla hemanth katare
bhopal
journalism student

More Telugu News