సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

షార్ట్స్‌లో చూడండి
*  కథానాయిక తాప్సీ ఇటీవల హిందీలో నటించిన 'దిల్ జంగ్లీ' చిత్రాన్ని ఈ నెల 16న విడుదల చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంపై తాప్సీ చాలా ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాల్లో తను బిజీగా వుంది.
*  తమన్నా కథానాయికగా రూపొందుతున్న 'క్వీన్' తెలుగు వెర్షన్ కి ప్రముఖ కన్నడ నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తాడు. తమన్నాతో మనస్పర్థల కారణంగా దర్శకుడు నీలకంఠ తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి రమేశ్ వచ్చాడు. ఇప్పటికే ఈయన 'క్వీన్' తమిళ, కన్నడ వెర్షన్లకు దర్శకత్వం వహిస్తున్నాడు.  
*  ఇటీవల 'అజ్ఞాతవాసి' చిత్రానికి సంగీతాన్ని అందించిన యువ తమిళ సంగీత దర్శకుడు అనిరుథ్ రెస్టారెంట్ వ్యాపారంలోకి దిగాడు. స్నేహితులతో కలసి చెన్నయ్ లో 'సమ్మర్ హౌస్ ఈటారీ' పేరిట ఓ రెస్టారెంటును ప్రారంభించాడు.  
*  అందాల భామ అనుష్కకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి ఊహించని విధంగా ఫోన్ కాల్ వచ్చింది. 'భాగమతి' చిత్రంలోని ఆమె అభినయాన్ని ప్రశంసిస్తూ రజనీ అనుష్కతో మాట్లాడాడట. ఈ విషయం గురించి అనుష్క చెబుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
Go Back to Shorts
Tapsi
Tamannaah
aniruth
Anushka Shetty

More Telugu News