తమిళనాడు మధుర మీనాక్షి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. 50 దుకాణాలు దగ్ధం.. ఉద్రిక్తత
- ఆలయం మూసేసిన తర్వాత ప్రమాదం
- వేయికాళ్ల మండపంలో చెలరేగిన మంటలు
- ఆలయం వద్ద ఉద్రిక్తత
ప్రమాదంలో 50 దుకాణాలు దగ్ధమయ్యాయని కలెక్టర్ వీర రాఘవరావు తెలిపారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఆలయం మూసివేసిన తర్వాత అర్ధరాత్రి వేయికాళ్ల మండపం వద్ద మంటలు చెలరేగినట్టు తెలిపారు. పూజా సామగ్రి అంటుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శకటాలు ప్రయత్నిస్తున్నాయి.