Chandrababu: 8న దుబాయ్ పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు

  • పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా బాబు పర్యటన
  • ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న సీఎం 
  • దావోస్ లో ఇటీవల మూడు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న చంద్రబాబు
ఈ నెల 8న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటనకు వెళ్లనున్నారు. నవ్యాంధ్రకు పెట్టుబడులు రాబట్టే క్రమంలో చంద్రబాబు ఈ పర్యటనకు వెళుతున్నట్టు సమాచారం. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో బాబు భేటీ కానున్నారు. కాగా, దావోస్ లో ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. దావోస్ లో నాలుగు రోజులు పర్యటించిన చంద్రబాబు, పలు ప్రముఖ సంస్థల సీఈఓలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మూడు సంస్థలతో అవగాహనా ఒప్పందాలు చంద్రబాబు సమక్షంలో జరిగాయి.
Chandrababu
Andhra Pradesh
dubai

More Telugu News