tgv: పవన్ కల్యాణ్ చెబితే వినడానికి మేమేమన్నా చిన్నపిల్లలమా?: టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్

షార్ట్స్‌లో చూడండి
భారతీయ జనతా పార్టీతో దోస్తీ వదులుకుని, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలుస్తామా? లేదా? అన్న విషయం గురించి ఆయా పార్టీల అధినేతలు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. టీడీపీ ఎంపీలు అందరూ రాజీనామా చేయాలంటూ గతంలో పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారని, ఆ మేరకే రాజీనామా చేయనున్నారా? అని అడగగా, టీజీవీ సమాధానం ఇస్తూ, 'పవన్ చెబితే వినడానికి మేమేమన్నా చిన్నపిల్లలమా?' అని చురకలంటించారు. బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారని, ఎల్లుండి సాయంత్రం చంద్రబాబు టీడీపీ నేతలతో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలని అన్నారు,.
Go Back to Shorts
tgv
interviwe
Pawan Kalyan
Telugudesam

More Telugu News