mohan babu: మోహన్ బాబుగారితో కలిసి పనిచేయడం గర్వంగా వుంది: 'గాయత్రి' దర్శకుడు

  • మోహన్ బాబు గారు గొప్ప నటులు 
  • ఒకే సిటింగ్ లో ఈ కథను ఓకే చేశారు
  • ఆయనతో సినిమా చేయడం నా అదృష్టం 
మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'గాయత్రి' సినిమాకి మదన్ దర్శకుడిగా వ్యవహరించాడు. టైటిల్ రోల్ లో నిఖిలా విమల్ నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో మంచు విష్ణు, శ్రియ కనిపించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది.

మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాను గురించి దర్శకుడు మదన్ మాట్లాడుతూ .. "తండ్రీ కూతుళ్ల మధ్య చోటుచేసుకునే బలమైన కథా కథనాలతో ఈ సినిమా కొనసాగుతుందని చెప్పారు. ఇద్దరు మోహన్ బాబులలో ఒకరు యంగ్ గా వున్నప్పటి పాత్రలో విష్ణు కనిపిస్తాడని అన్నారు. ఒకేఒక సిటింగ్ లో మోహన్ బాబు ఈ కథను ఓకే చేశారు. ఆయన ఎంతటి గొప్ప నటుడనే విషయం ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకోవడానికి అవకాశం లభించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనతో కలిసి పనిచేసినందుకు నాకెంతో గర్వంగా వుంది" అని అన్నారు.   
mohan babu
nikhila vimal

More Telugu News