Chandrababu: కేంద్ర బడ్జెట్ పై మనం సైలెంట్ గా ఉంటే ప్రమాదకరం: సీఎం చంద్రబాబు

  • ముగిసిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ
  • రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటం కొనసాగిద్దాం
  • మరీ అతిగా స్పందించవద్దు, మిత్రధర్మాన్ని పాటిద్దాం
  • టీడీపీ నేతలకు సూచించిన చంద్రబాబు
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నిన్న ప్రకటించిన బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిన విషయమై మనం మౌనంగా ఉంటే ప్రమాదకరమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. కేంద్ర బడ్జెట్ విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, కేంద్ర ప్రభుత్వం తీరుపై పోరాటం కొనసాగిద్దామని నేతలకు సూచించిన చంద్రబాబు, ఈ విషయమై మరీ అతిగా స్పందించవద్దనే సూచనా చేశారు.

అతిగా స్పందిస్తే ఏపీలో జరగాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని, మిత్ర ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని పోరాడదామని అన్నారు. ‘దళిత తేజం - తెలుగుదేశం’ పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని, ప్రజల మనోభావాలను గ్రహించి ముందుకెళ్లాలని, త్వరలో బీసీలు, మైనార్టీల సదస్సులు నిర్వహించాలని ఈ సమావేశంలో చంద్రబాబు ఆదేశించారు. 
Chandrababu
Andhra Pradesh
Union Budget 2018-19

More Telugu News