Mahesh Babu: ఆయన లేకుండా కెమేరా ముందుకు వెళ్లలేను!: 'మేకప్ మేన్'తో అనుబంధం గురించి ప్రిన్స్ మహేష్

  • గత 24 ఏళ్లుగా మేకప్ మ్యాన్‌గా ఉన్న పట్టాభి
  • మై ఫేవరేట్ కలర్ ..మై మ్యాన్ ఇన్ బ్లూ అంటూ పోస్ట్
  • బాల్యం నాటి ఫోటోని గుర్తు చేసుకున్న మహేష్
బాల నటుడి నుంచి టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఎదిగిన మహేష్ బాబు తన కుటుంబంతో పాటు తన స్టాఫ్‌ను కూడా ఎంతగానో గౌరవిస్తాడు. గత 24 ఏళ్లుగా తనకు మేకప్ మేన్‌గా ఉన్న పట్టాభి గురించి చెబుతూ మహేష్ బాబు తన ఫేస్ బుక్ అకౌంట్లో ఓ ఫొటో పోస్టు చేశాడు.

అందులో ‘మీ మహేష్ ఓ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్‌తో ఉన్నాడు (కృష్ణ). ఇక ఇతను (మేకప్ మేన్) నాతో 24 ఏళ్లుగా ఉంటున్నాడు. ఆయన లేకుండా నేను కెమేరా ముందుకు వెళ్లలేను. అది మరెవరో కాదు.. మై ఫేవరేట్ కలర్ ..మై మేన్ ఇన్ బ్లూ, పట్టాభి’’ అంటూ అలనాటి ఫొటో ఒకటి పోస్ట్ చేశాడు.
Mahesh Babu
Tollywood

More Telugu News