acid: లాడ్జిలో భార్యపై భర్త యాసిడ్ దాడి!

షార్ట్స్‌లో చూడండి
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను తీసుకుని నిన్న రాత్రి కసుమూరులోని ఓ లాడ్జికి వచ్చాడు. అయితే, లాడ్జిలో భార్యపై యాసిడ్‌తో దాడి చేసి అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. పథకం ప్రకారమే ఆ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై లాడ్జి సిబ్బంది అందించిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితురాలు సభానాను ఆసుపత్రికి తరలించారు. ఆ దంపతులు పొదలకూరుకు చెందిన వారని గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే భార్యపై భర్త యాసిడ్ పోశాడని, నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఆమెకు చికిత్స అందుతోందని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.          
Go Back to Shorts
acid
attack
husband
wife

More Telugu News