Deepika Padukone: నా ముక్కును వదిలేయండి.. కావాలంటే కాళ్లు నరుక్కోండి: దీపికా పదుకొనే చమత్కారం

  • నా ముక్కును కత్తిరించొద్దు
  • నా ముక్కు అంటే నాకు చాలా ఇష్టం
  • ఇలాంటి బెదిరింపులకు భయపడను
అనేక వివాదాల మధ్య విడుదలై, విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది బాలీవుడ్ మూవీ 'పద్మావత్'. ఈ సినిమాను అడ్డుకునేందుకు రాజ్ పుత్ కర్ణిసేన ఎంతో ప్రయత్నించిన సంగతి తెలిసిందే. చివరకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, హీరోయిన్ దీపిక పదుకొనే ముక్కు, తల నరికి తెచ్చిన వారికి భారీ నజరానాలను కూడా నిరసనకారులు ప్రకటించారు. ఈ బెదిరింపులపై తాజాగా దీపిక స్పందించింది.

'పద్మావత్'లో నటించినందుకు తన తల, ముక్కు నరికి తీసుకురావాలనే బెదిరింపులు వస్తున్నాయని, 'దయచేసి నా ముక్కును మాత్రం కత్తిరించొద్దు' అని ఆమె అంది. తన ముక్కు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. కావాలంటే పొడవుగా ఉన్న తన కాళ్లను నరికేసుకోవాలని చమత్కరించింది. అయినా ఇలాంటి బెదిరింపులను దైర్యంగా ఎదుర్కోవడానికి తాను భయపడనని చెప్పింది. 
Deepika Padukone
Padmaavat
bollywood

More Telugu News