India: మా విజయానికి కారణం ఇండియానే: అమెరికా

  • టెర్రరిజంపై భారత్ పోరు చాలా గొప్పది
  • భాగస్వాములను ఏకం చేస్తున్న తీరు అద్భుతం
  • ఇండియా తీరును మేము కూడా కొనసాగిస్తే.. లక్ష్యాన్ని చేరుకుంటాం
తమ దక్షిణాసియా స్ట్రాటజీ విజయవంతంగా అమలవుతోందంటే దానికి కారణం ఇండియానే అని అమెరికా ప్రశంసలు కురిపించింది. తమ దక్షిణాసియా వ్యూహంలో భారత్ దే కీలకపాత్ర అని చెప్పారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు భారత్ చేస్తున్న కృషి అద్భుతమని తెలిపింది. ఉగ్రవాదాన్ని ఎలా నిర్మూలించాలనే విషయంలో ఎవరికైనా భారతే ఉదాహరణ అని పెంటగాన్ చీఫ్ అధికారిక ప్రతినిధి దానా వైట్ అన్నారు.

టెర్రరిజాన్ని తుదముట్టించేందుకు భాగస్వాములను భారత్ ఏకం చేస్తున్న తీరు చాలా గొప్పదని... భారత్ తీరునే తాము కూడా కొనసాగిస్తే లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ఎన్నో రకాలుగా కలసి పనిచేసేలా భారత్ తో తమకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు. దక్షిణాసియా వ్యూహాన్ని అభివృద్ధి చేసేందుకు ఇండియా గొప్ప నిధిని కేటాయించిందని చెప్పారు. ఏవియేషన్ మెయింటెనెన్స్ విషయంలో కూడా భారత్ సహాయం చేస్తోందని తెలిపారు.
India
america
pentagon
terrorism
south asia strategy

More Telugu News