BJP: టీడీపీని చూసి భయపడొద్దు... దూసుకెళ్లండి: అమిత్ షా

  • విమర్శలను తిప్పికొట్టండి
  • డీపీఆర్ ఇవ్వకపోయినా అమరావతికి నిధులిస్తున్నాం
  • పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిని పెట్టండి
  • బీజేపీ నేతలకు అమిత్ షా సూచన
కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని, వారిని చూసి భయపడ వద్దని బీజేపీ నేతలకు ఆ పార్టీ చీఫ్ అమిత్ షా సూచించారు. పలువురు పార్టీ నేతలు అమిత్ షాను కలవగా, టీడీపీ అనుసరిస్తున్న వైఖరి గురించి నేతలు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఏపీ అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నామని చెప్పిన అమిత్, పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, టీడీపీ విమర్శలకు దీటైన జవాబులు ఇవ్వాలని సూచించారు.

అమరావతికి సంబంధించిన డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రోగ్రసివ్ రిపోర్ట్)ను ఇప్పటివరకూ ఇవ్వకపోయినా, నిధులను మాత్రం అందిస్తూనే ఉన్నామని గుర్తు చేసిన అమిత్ షా, రైల్వే జోన్ అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇక అసెంబ్లీ సీట్లను పెంచే విషయంలోనూ బీజేపీ నేతల అభిప్రాయాన్ని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. తాను త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తానని, ఈదఫా రాయలసీమలో తన పర్యటన ఉంటుందన్న సంకేతాలను ఇచ్చారు.
BJP
Amit Sha
Andhra Pradesh
Telugudesam

More Telugu News