sai dharam tej: అభిమానుల కాళ్లకు నమస్కరించి షాకిచ్చిన సాయి ధరమ్ తేజ్!

  • ‘ఇంటిలిజెంట్‌’ సినిమాలో పాటను విడుదల చేసిన చిత్రబృందం
  • సాయి ధరమ్ తేజ్ ను చూడగానే కాళ్లకు నమస్కరించిన అభిమానులు
  • తమ కాళ్లకు సాయి కూడా నమస్కరించడంతో షాక్ కు గురైన అభిమానులు
తమ అభిమాన హీరోలను ఆయా అభిమానులు ఆరాధనాభావంతో చూస్తుంటారు. వారి ఫొటోలకు పూజలు కూడా చేస్తుంటారు. ఇక విషయానికి వస్తే, వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ఇంటిలిజెంట్‌’ సినిమాలో ‘కళా కళామందిర్‌’ అనే పాటను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా సాయి ధరమ్‌ తేజ్‌ ను చూసేందుకు వచ్చిన అభిమానులు, ఆయనకు పాదాభివందనం చేయడానికి ఉపక్రమించారు.

అయితే, తాను పాదాభివందనం పొందేటంతటి గొప్పవాడిని కాదని, ఇకపై అలా చేయవద్దని వారిస్తూ, అభిమానుల కాళ్లకు తాను కూడా ప్రతి నమస్కారం చేశాడు సాయి ధరమ్‌ తేజ్‌. తమ అభిమాన హీరో అలా కాళ్లకు నమస్కారం చేయడంతో అభిమానులు షాక్ తిన్నారు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. కాగా, ఇటీవల ప్రముఖ నటుడు సూర్య అభిమానుల కాళ్లకు నమస్కరించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
sai dharam tej
inteligent movie
song relese

More Telugu News