Chandrababu: నేడు నెక్కల్లుకు చంద్రబాబు.. భారీ బందోబస్తు!

  • యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ కు శంకుస్థాపన
  • 350 మందితో భారీ బందోబస్తు
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లుకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళుతున్నారు. ఈ సందర్భంగా 'యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్'కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులు చేశారు. బందోబస్తు నిమిత్తం 350 మంది సిబ్బందిని నియమించినట్టు గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు తెలిపారు. భూమి పూజ జరిగే ప్రాంతం, పార్కింగ్ ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు ఇచ్చామని చెప్పారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూసేందుకు ఆయా రూట్లలో కూడా పోలీసులను నియమించామని తెలిపారు.
Chandrababu
universal peace retreat center
nekkallu
tulluru

More Telugu News