Amitabh Bachchan: ఇలా అయితే ఇక ట్విట్టర్ ను వదిలేస్తానంటూ హెచ్చరించిన అమితాబ్!

  • అమితాబ్ కంటే షారుఖ్ కే ఎక్కువ ఫాలోయర్లు ఉన్నారన్న ట్విట్టర్
  • ఆగ్రహానికి గురైన అమితాబ్
  • తన ఫాలోయర్ల సంఖ్యను తగ్గించిందంటూ మండిపాటు
ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్... దాన్ని వదిలేస్తానంటూ హెచ్చరించి సంచలనం రేపారు. అమితాబ్ ను ట్విట్టర్ లో ఫాలో అయ్యే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. 3 కోట్ల 29 లక్షల 2 వేల మందికి పైగా ఆయనను ఫాలో అవుతున్నారు.

తాజాగా, అమితాబ్ ను షారుఖ్ మించిపోయాడని... షారుఖ్ కు 3 కోట్ల 29 లక్షల 44 వేలకు పైగా ఫాలోయర్లు ఉన్నారని ట్విట్టర్ ప్రకటించింది. ఇది అమితాబ్ కు ఆగ్రహం తెప్పించింది. ట్విట్టర్ పెద్ద జోక్ అని... తన ఫాలోయర్ల సంఖ్యను ట్విట్టర్ తగ్గించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాగైతే, తాను ట్విట్టర్ ను వదిలేస్తానని హెచ్చరించారు.
Amitabh Bachchan
Shahrukh Khan
twitter

More Telugu News