Egg attack on Odisha CM Naveen: ఒడిశా సీఎంపై కోడి గుడ్లతో దాడికి పాల్పడిన మహిళ!

  • బాలాసోర్ లో ర్యాలీ నిర్వహించిన నవీన్ పట్నాయక్
  • బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా గుడ్లతో దాడికి దిగిన మహిళ
  • సీఎంకు రక్షణగా నిల్చున్న భద్రతా సిబ్బంది
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పై ఓ మహిళ కోడిగుడ్లతో దాడికి దిగిన ఘటన బాలాసోర్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.... ఒడిశాలోని బాలాసోర్‌ లో సీఎం నవీన్ పట్నాయక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ ఆయన మాట్లాడుతున్న సమయంలో సభికుల్లోంచి వేదిక వద్దకు వచ్చిన ఒక మహిళ ఆయనపై కోడిగుడ్లను విసిరేసింది.

దీనిని గమనించిన ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనకు రక్షణగా నిల్చున్నారు. దీంతో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Egg attack on Odisha CM Naveen
naveen patnaik
lady egg attack

More Telugu News