Babu Gogineni: బిర్యానీ తెప్పిస్తారనుకుంటే బిస్కెట్లతో సరిపెట్టారే ! : బాబు గోగినేని చమత్కారం

  • విదేశీ బిస్కెట్లే కాదు హైదరాబాద్ సమోసా, బిర్యానీ తెప్పించండి 
  • ఇలాంటివి నేను నమ్మను
  • ఎంత విపరీతమైన వాదనైనా చేస్తా: ఓ టీవీ ఇంటర్వ్యూలో గోగినేని
‘బిర్యానీ తెప్పిస్తారనుకుంటే బిస్కెట్లతో సరిపెట్టారే!’ అంటూ ‘టీవీ 9’ లైవ్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ హేతువాది బాబు గోగినేని యాంకర్ తో చమత్కరించారు. చంద్రగ్రహణం సమయంలో తినకూడదు, తాగకూడదంటూ జ్యోతిష్యులు చెప్పే మాటలను పట్టించుకోవద్దని చెప్పిన ఆయన, టీ తాగి, బిస్కెట్లు తిన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘విదేశీయులు చేసిన బిస్కెట్లే కాదు, హైదరాబాద్ లో చేసిన సమోసా, ఆ తర్వాత బిర్యానీ తెప్పించండి తింటాం. ఇలాంటివి నేను నమ్మను. ఎంత విపరీతమైన వాదనైనా చేస్తాను. మీరేదో బిర్యాని తెప్పిస్తారనే ఆశతో వస్తే బిస్కెట్లా? మీది ప్రాఫిట్ మేకింగ్ సంస్థ’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ‘నేను వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్. క్యారెట్లు తినకుండా కేవలం కోడిని మాత్రమే తినేవాడిని నేను కాదు’ అని చెప్పుకొచ్చారు.
Babu Gogineni
Andhra Pradesh
lunar eclipse

More Telugu News