Hyderabad: రోడ్డుపై పాదచారి ప్రాణాలు కాపాడిన హైదరాబాద్‌ హోంగార్డులు.. మీరూ చూడండి!

  • పురానాపూల్ వంతెన వద్ద ఘటన
  • గుండెనొప్పితో కుప్పకూలిన వ్యక్తి 
  • గుండెపై రాపిడి చేసి ఆసుపత్రికి తరలించిన హోంగార్డులు
హైదరాబాద్‌లోని పురానాపూల్ వంతెన వద్ద ఓ వ్యక్తి గుండెపోటు వచ్చి పడిపోయి బాధపడుతుండగా వెంటనే స్పందించిన హోంగార్డులు ఆయనను కాపాడారు. కుప్పకూలిన వ్యక్తి గుండెపై రాపిడి చేసి ఆయన ప్రాణాలను నిలబెట్టారు. అనంతరం వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తనను కాపాడిన హోంగార్డులు చందన్ సింగ్, వినయతుల్లాకు బాధిత వ్యక్తి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను హైదరాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మీరూ చూడండి...
Hyderabad
Police
Viral Videos

More Telugu News