super moon: చంద్రగ్రహణం ప్రారంభం.. ఆకాశంలో అత్యంత అరుదైన దృశ్యం.. మీరూ చూడండి!

  • ఆ దృశ్యాన్ని చూడడానికి ఉత్సాహం చూపిస్తోన్న ప్రజలు
  • ‘సూపర్‌ మూన్‌’, ‘బ్లూ మూన్‌’, ‘బ్లడ్‌ మూన్‌’ల రూపాల్లో చందమామ
  • ఇప్పుడు చూసే అవకాశం కోల్పోతే మళ్లీ 2037 వరకు ఆగాల్సిందే
ఈ రోజు సాయంత్రం 5.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమైంది. అత్యంత అరుదైన రూపంలో చంద్రుడు కనపడుతుండడంతో ప్రజలు ఆ దృశ్యాన్ని చూడడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ‘సూపర్‌ మూన్‌’, ‘బ్లూ మూన్‌’, ‘బ్లడ్‌ మూన్‌’లను చూస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అరుదైన దృశ్యం చివరిగా 1982లో కనపడింది. ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూసే అవకాశం కోల్పోతే  మళ్లీ ఇటువంటి దృశ్యాన్ని చూడడానికి 2037 వరకు ఆగాల్సిందే.  భ్రమణ సమయంలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సంభవించే పౌర్ణమిని ‘సూపర్‌ మూన్‌’గా పిలుస్తారు. మీరూ చూడండి..   
super moon
nasa
blue moon

More Telugu News