samrat: యువ నటుడు సామ్రాట్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు!

  • సామ్రాట్ రెడ్డిపై అతడి భార్య హర్షిత ఫిర్యాదు
  • నిన్న చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు
  • కాసేపట్లో విడుదల
యువ నటుడు సామ్రాట్ రెడ్డిపై అతని భార్య హర్షిత హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన సామ్రాట్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను నిన్న చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, ఈ రోజు ఆయనకు బెయిల్ లభించింది. కాసేపట్లో ఆయనను చర్లపల్లి జైలు నుంచి విడుదల చేయనున్నారు.

కాగా, తన భర్త సామ్రాట్ రెడ్డి ‘గే’ అని అంతేగాక, తనను ఆయన అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని హర్షిత ఫిర్యాదు చేసింది. తన పేరిట ఉన్న ఆస్తులను రాయించుకోవాలని చూస్తున్నాడని కూడా ఆమె ఆరోపించింది. 
samrat
Hyderabad
bail

More Telugu News