Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు... ఇళ్లు, కార్యాలయాల నుంచి పరుగులు పెట్టిన జనం!

ఢిల్లీ, జమ్ముకశ్మీర్, హర్యాణా, పంజాబ్ లలో ప్రకంపనలు

పరుగులు పెట్టిన ప్రజలు

హిందుకుష్ లో భూకంప కేంద్రం

దేశ రాజధాని ఢిల్లీని భూప్రకంపనలు వణికించాయి. భయకంపితులైన ప్రజలు ఇళ్లు, కార్యాలయాలు, షాపుల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఆప్ఘనిస్థాన్ లోని హిందూకుష్ ప్రాంతంలో 190 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియొలాజికల్ సర్వే తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా ఉంది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. జమ్ముకశ్మీర్ లో కూడా ప్రకంపనల తీవ్రత భారీగానే ఉంది.

 శ్రీనగర్ లో ప్రకంపనల కారణంగా పిల్లర్లపై నుంచి నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పక్కకు ఒరిగిపోయింది. శ్రీనగర్ లో ఓ వ్యక్తి మాట్లాడుతూ, తాను బైక్ పై వెళుతున్నప్పుడు భూమి కంపించిందని... దీంతో, తాను బైక్ పై నుంచి కిందకు పడిపోయానని చెప్పాడు. మరోవైపు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలలో కూడా భూమి కంపించినట్టు సమాచారం.  

More Telugu News