NASA: అంతరిక్షంలో తప్పిపోయిన నాసా ఉపగ్రహం జాడ తెలిసింది!

షార్ట్స్‌లో చూడండి
అంతరిక్షంలో కనిపించకుండా పోయిన అమెరికా ఉపగ్రహం జాడ సుమారు 12 ఏళ్ల తరువాత అనూహ్యంగా లభ్యమైంది. అమెరికా సైనిక అవసరాల నిమిత్తం ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ-‘నాసా’ ‘ఇమేజ్‌’ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అయితే అది అంతరిక్షంలో తప్పిపోయింది. దీంతో తాజాగా అమెరికా సైనిక అవసరాల నిమిత్తం ‘జుమా’ అనే ఉపగ్రహాన్ని నాసా ప్రయోగించగా, అది కూడా కనిపించకుండా పోయింది. దీంతో ఈ ఉపగ్రహం కోసం స్కాట్‌ టిల్లీ అనే ఔత్సాహిక ఖగోళశాస్త్రజ్ఞుడు విశ్వంలో శోధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఒక సంకేతాన్ని గుర్తించి, దానిని డీకోడ్ చేసే ప్రయత్నం చేశాడు.

 అది భూ-అయస్కాంతావరణంపై సౌరగాలుల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు నాసా ప్రయోగించిన 'ఇమేజ్‌' ఉపగ్రహం నుంచి వెలువడిన సంకేతంగా నిర్ధారణ అయింది. 2000 మార్చి 25లో ప్రయోగించిన ఉపగ్రహాల్లో వినియోగించిన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ వెర్షన్లు అప్ గ్రేడ్ అయ్యాయని, అయితే ఈ ఉపగ్రహంలో సంకేతాలు ఇచ్చిపుచ్చుకునే సాఫ్ట్‌ వేర్‌, హార్డ్‌ వేర్‌ మొత్తం ఇమేజ్‌ లో పాడైపోయిందని నాసాకు చెందిన గాడ్డార్డ్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ తెలిపింది. దీంతో ఆ ఉపగ్రహంలో సంకేతాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ పని చేయడం లేదని, అయితే అది పంపే సంకేతాలను రివర్స్ ఇంజనీరింగ్ విధానం ద్వారా విశ్లేషించే ప్రయత్నంలో ఉన్నామని తెలిపింది. 
Go Back to Shorts
NASA
satellite
image satellite
juma satellite

More Telugu News