Tollywood: యువనటుడు సామ్రాట్ రెడ్డి చర్లపల్లి జైలుకు తరలింపు

  • సామ్రాట్ రెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్
  • భార్య హర్షిత ఫిర్యాదు మేరకు ఈరోజు ఉదయం అరెస్టు
  • సామ్రాట్ పలు ఆరోపణలు గుప్పించిన హర్షిత
యువ నటుడు సామ్రాట్ రెడ్డిపై అతని భార్య హర్షిత హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ లో దొంగతనం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన సామ్రాట్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది. సామ్రాట్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.

కాగా, సామ్రాట్ రెడ్డి ‘గే’ అని, అదనపు కట్నం కోసం తనను వేధింపుల పాలు చేసేవాడని, తన పేరిట ఉన్న ఆస్తులను అతని పేరుపైకి బదలాయించాలంటూ ఒత్తిడి చేసేవాడని అతని భార్య హర్షితా రెడ్డి, ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.
Tollywood
samrat reddy

More Telugu News