Donald Trump: వాళ్లను అంతం చేయడానికి నేరుగా ఏం చేయాలో అదే చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

  • ఇటీవలే కాబూల్‌లో 100 మంది ప్రాణాలు తీసిన తాలిబన్‌లు
  • తాలిబన్‌లతో శాంతి చర్చలు ఉండబోవని చెప్పిన ట్రంప్
  • సొంత ప్రజలనే అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు-ట్రంప్
ఇటీవలే ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్‌లు కారు బాంబులు పేల్చి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు వంద మంది మృతి చెందగా, మరో 235 మందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాము తాలిబన్లతో శాంతి పేరిట చర్చలు జరపబోమని ప్రకటించారు. తాలిబన్లు తమ సొంత ప్రజలనే అత్యంత దారుణంగా హతమారుస్తున్నారని, చనిపోతోన్న వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారితో తాము మాట్లాడటానికి సిద్ధంగా లేమని, వాళ్లను అంతం చేయడానికి ఏం చేయాలో అదే చేస్తామని స్పష్టం చేశారు. కాబూల్‌లో జరిగిన ఉగ్ర కలకలంపై భారత్ కూడా స్పందిస్తూ ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.   
Donald Trump
talibons
america
kabool

More Telugu News