Ranga Reddy District: ఖాతాల్లో భారీగా నగదు మాయం.. బ్యాంకు ముందు ఆందోళనకు దిగిన ఖాతాదారులు

  • రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఆజిజ్‌నగర్ దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో ఘటన
  • సుమారు 40 మందికి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల్లో నగదు మాయం
  • మొత్తం మూడు కోట్ల రూపాయలు మాయమయినట్లు సమాచారం
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఆజిజ్‌నగర్ దక్కన్ గ్రామీణ బ్యాంక్ ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. సుమారు 40 మందికి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల్లో నగదు మాయం అయిందని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఆ బ్యాంకులో మొత్తం మూడు కోట్ల రూపాయలు మాయం అయినట్లు తెలుస్తోంది. ఖాతాదారుల డబ్బులు మాయం అయిన విషయంపై సంబంధిత అధికారులు ఇంకా వివరణ ఇవ్వలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
Ranga Reddy District
daccan grameen bank
account holders
strike

More Telugu News