samrat reddy: అదే నిజమైతే, పోలీసులకు ఎప్పుడో పట్టుబడేవాడిని: నటుడు సామ్రాట్ రెడ్డి

  • డ్రగ్స్ తీసుకుంటాననే ఆరోపణల్లో వాస్తవం లేదు
  • నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు
  • సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం తప్పే
తనకు డ్రగ్స్ అలవాటు ఉందని తన భార్య హర్షిత, ఆమె కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని నటుడు సామ్రాట్ రెడ్డి తెలిపాడు. తనకు ఆ అలవాటే ఉంటే... పోలీసులకు ఎప్పుడో పట్టుబడేవాడినని చెప్పాడు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని అన్నాడు.

ఇంట్లో నుంచి డబ్బు, నగలు దొంగలించానని హర్షిత ఆరోపిస్తోందని... అందులో కూడా వాస్తవం లేదని తెలిపాడు. తన ఇంట్లో తనకు కావాల్సిన వస్తువులను మాత్రమే తాను తీసుకున్నానని చెప్పాడు. కోపంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేశానని... అది మాత్రం తప్పేనని అన్నాడు.
samrat reddy
harshitha reddy
tollywood

More Telugu News