Telangana: వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆరే గెలుస్తారని అన్ని సర్వేలు చెబుతున్నాయి: ఎంపీ కవిత

షార్ట్స్‌లో చూడండి
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, వందశాతం కేసీఆరే గెలుస్తారని అన్ని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో విపక్ష పార్టీలన్నీ ఏకమైతే మంచిదేనని, వార్ వన్ సైడ్ అవుతుందని, గెలుపు కేసీఆర్ వైపే ఉంటుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.

కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ లేదని, ఉంటే కనుక మహిళకు అవకాశమివ్వమని ముఖ్యమంత్రిని అడుగుతానని అన్నారు. జేఏసీ నేత కోదండరామ్ పార్టీ పెడితే స్వాగతిస్తామని చెప్పిన కవిత, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చేందుకు చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
Go Back to Shorts
Telangana
KCR
K Kavitha

More Telugu News