మీకు ద్రవిడ్ ఉన్నాడు...మరి మాకో?.. పాక్ ఫ్యాన్స్ నిరాశ!

షార్ట్స్‌లో చూడండి
అండర్ 19 వరల్డ్‌ కప్ సెమీఫైనల్లో పాకిస్థాన్‌ ను ఇండియా చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. అన్ని విభాగాల్లోను విఫలమైన పాకిస్ధాన్ జట్టుపై అభిమానులు మండిపడుతున్నారు. పనిలో పనిగా కోచ్ పై మరీ మండిపడుతున్నారు. భారత్ కు శుభాకాంక్షలు చెబుతూ, ద్రవిడ్ లాంటి లెజెండ్ కోచ్ గా ఉంటే ఇలాంటి విజయాలు సాధారణమని అంటున్నారు.

పాక్ కు మాత్రం అలాంటి వ్యక్తి కోచ్ గా లేడని, పాక్ కోచ్ మన్సూర్ రానా ఆడింది కేవలం రెండు వన్డేలు, చేసింది 15 పరుగులేనని, కనీసం ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడని వ్యక్తిని కోచ్‌ గా ఎందుకు పెట్టుకున్నారోనని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో భారత క్రికెట్ భవిష్యత్ సరైన వ్యక్తి చేతుల్లోనే ఉందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. 
Go Back to Shorts
Cricket fans
Pakistan
u-19 world cup

More Telugu News