abhishaik bachan: నా కూతురు ఇంట్లో ఉన్నంతసేపు ఆడుతూనే ఉంటుంది: అభిషేక్ బచ్చన్

  • ‘మన్మర్జియా’ సినిమాలో నటిస్తున్న అభిషేక్ బచ్చన్
  • ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటాను
  • పిల్లలకు ఏది నచ్చితే అది చెయ్యనివ్వాలి
తన కుమార్తె ఇంట్లో ఉన్నంతసేపు ఆటలాడుతుందని బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ తెలిపాడు. ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఆటలంటే చాలా ఇష్టమన్నాడు. అందుకే ప్రో కబడ్డీ లీగ్‌ లో జయపుర పింక్‌ పాంథర్స్‌ జట్టు, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ లో చెన్నయన్ ఫుట్‌ బాల్‌ క్లబ్‌ కు‌ యజమానిగా ఉన్నానని తెలిపాడు. ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందుంటానని పేర్కొన్నాడు.

 ప్రధానంగా ఆటలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయని ఆయన అన్నారు. తన కుమార్తెకు అన్ని ఆటలు ఇష్టమేనని చెప్పాడు. ఆమె ఏ క్రీడను ఎంచుకున్నా తనకు ఇష్టమేనని అభిషేక్ తెలిపాడు. పిల్లల మనసుకు ఏది నచ్చితే అది చెయ్యనివ్వాలని సూచించాడు. ప్రస్తుతం తాను ‘మన్మర్జియా’ సినిమాలో నటిస్తున్నానని అన్నాడు. విరామం తరువాత మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నానని అన్నాడు. తననుంచి ప్రేక్షకులు చాలా ఆశిస్తారని చెప్పాడు. తాప్సీతో జతకట్టిన ఈ సినిమాకు అనురాగ్‌ కశ్యప్‌ దర్శకుడు. 
abhishaik bachan
Bollywood
mumbai

More Telugu News