ram gopal varma: దేవిగారూ... వింటున్నారా?: రామ్ గోపాల్ వర్మ

  • జీఎస్టీపై ట్విట్టర్లో పోల్ నిర్వహించిన వర్మ
  • 73 శాతం అనుకూలంగా ఓటు
  • 'దేవి గారూ వింటున్నారా' అన్న వర్మ
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' లఘు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమా పెద్ద దుమారాన్ని లేపింది. మహిళా సంఘాలు దీనిపై విరుచుకుపడ్డాయి. సామాజిక కార్యకర్త దేవి కూడా ఈ సినిమాపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, ఆమెపై వర్మ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయనపై దేవి పోలీస్ కేసు కూడా పెట్టారు.

ఇవన్నీ పక్కనపెడితే... ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్ లో వర్మ ఓ పోల్ నిర్వహించారు. "జీఎస్టీి ఇన్ స్పైడర్ లో మీరు నాతో కలవగలరా? 'ఐ లవ్ సెక్స్ టూ'కు క్యాంపెయిన్ చేయగలరా?" అంటూ సర్వే నిర్వహించారు. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ, లక్ష మందికిపైగా ఈ పోల్ లో పాల్గొన్నారని... 73 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారని చెప్పారు. అంతేకాదు, 'దేవి గారూ, వింటున్నారా' అంటూ ఆమెను ఉద్దేశించి కామెంట్ చేశారు.
ram gopal varma
RGV
women activist
devi
tollywood
gst

More Telugu News