surya: సూర్యతో విలన్ గా తలపడనున్న జగపతిబాబు?

  • సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య 
  • మొదటి షెడ్యూల్ పూర్తి 
  • కథానాయికలుగా రకుల్ .. సాయి పల్లవి
విలన్ గా జగపతిబాబు తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఆయన విలన్ గా బిజీ అవుతున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం సూర్య సినిమాలోనూ ఆయన విలన్ గా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సూర్య .. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

రకుల్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే చెన్నై లో ఒక షెడ్యూల్ షూటింగును జరుపుకుంది. రెండవ షెడ్యూల్ ను ఫిబ్రవరి రెండవ వారంలో మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ రోల్ పవర్ ఫుల్ గా ఉండటంతో జగపతిబాబును సంప్రదించారట. ఈ పాత్రను చేయడానికి ఆయన సుముఖతను వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. 
surya
rakul
sai pallavi

More Telugu News